Choododhu - Karthik

Choododhu

Karthik

00:00

05:02

Similar recommendations

Lyric

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా

నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా

కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

వచ్చేయ్నా వచ్చేయ్నా మోమాటమింక మనకేల

వచ్చేయ్నా వచ్చేయ్నా ఆరాటమేదో కలిగేలా

వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా

వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా

సడియో సడియో సడియో నేనే వస్తానుగా

సడియో సడియో సడియో నీతో ఉంటానుగా

సడియో సడియో సడియో నువ్వే కావాలిగా

సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా

నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా

కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా

పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడి పోతుంటా

నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా

ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంటా

Every day ఓసారైనా confuse అవుతుంటా

చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా

నువులేని life-ఎ బోరని ఫీలైపోతుంటా

వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా

వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా

సడియో సడియో సడియో నేనే వస్తానుగా

ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా

సడియో సడియో సడియో నువ్వే రావాలిగా

గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా

చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా

నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా

నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంటా

నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా

నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా

నీ కన్నా విలువైంది నాకేదీ లేదంటా

నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా

వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా

వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా

హా సడియో సడియో సడియో నేనే వస్తానుగా

ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా

సడియో సడియో సడియో నువ్వే రావాలిగా

గడియో గడియో గడియో నేనే తీస్తానుగా

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా

నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా

వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా

కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

- It's already the end -