00:00
05:19
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
♪
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
తడిసి పోతున్నా
తడిసి పోతున్నా
♪
శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చినుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే
జాడ అయినా తెలియదేమే
ప్రతి క్షణం మనసిలా వెతికెనే నీకోసం
ఎందుకమ్మా నీకీ మౌనం
తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
♪
గుండెలోన వలపు గాయం
మంటరేపే పిదప కాలం
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం
భారమైన బతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా
కలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి చేరవా నేస్తమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహ జ్వాలే సెగలు రేపినది
మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
ప్రియతమా