Oh Pilla - Haricharan

Oh Pilla

Haricharan

00:00

05:08

Similar recommendations

Lyric

సూటిగా చెప్పలేను చాటుగా దాచలేను

తీరనీ ప్రేమ నేను

నిన్నెలా చేరుకోను

ఎందుకొచ్చావో నువ్వు నాలోకి

వేల రంగులల్లోన వెలిగానే

ఊపిరిచ్చావే గుండె లోగిలికి

వెండి మబ్బుల్లోన తిరిగానే

నిమిషమైనా నిను వదిలి

నిలువలేని మనసు ఇది

తనను తానే మరచినది

రెండుగా చీలనీ ఆకాశం

ముక్కలై పేలనీ భూగోళం

ఎన్నడూ లేనిలా నీకోసం ఉండనా

ఓ పిల్లా నువ్వంటే ఇష్టమే

ఓ పిల్లా నువ్వంటే ప్రాణమే

ఓ పిల్లా నా గుండె లోతుల్లో

చెరగని కల నువ్వే

ఓ పిల్లా నా వంక చూడవే

ఓ పిల్లా నా జంట చేరవే

ఓ పిల్లా నా బుజ్జి గుండెలో

నవ్వు ఊహించలే

రెప్ప లేని కంటి పాపై

చెలియా నిను చూస్తున్నా

అంతులేని నీ మౌనమే

నిలువున కాల్చినా

నింగి తీరాల చందమామ నువ్వు

నేల దారుల్లో గడ్డి పువ్వు నేను

అయ్యో దూరం చాలానే

నీతో నేనే సరిపోనే

అయినా నిను ప్రేమించానే

కురిసే నీ సిరి వెన్నెలనడిగానే

పువ్వులా కోరుకున్నా ముల్లులా గుచ్చుకోకే

ప్రేమగా వేడుకున్నా కాదని వెళ్లిపోకే

చిట్ట చీకటిగుందే ఏమీ తోచకుందే

చెంత నువ్వు లేని లోటుగా

మనసు ఆగనందే మార్గం ఏమిటందే

మరలా నిన్ను చేరగా

కనుల ముందే ఉన్న నిన్ను

చూసి చూడనే లేదుగా

కన్నా నిన్ను వదలకున్నా

నేరమంతా ఆ నా ప్రేమ

ఓ ప్రేమా నువ్వంటే ఇష్టమే

ఓ ప్రేమా నువ్వంటే ప్రాణమే

ఓ ప్రేమా నువ్వెంటో తెలియక

పొరపాటు అయినది

ఓ ప్రేమా నా బాద చూడవే

ఓ ప్రేమా నా చెంత చేరవే

ఓ ప్రేమా నా పిచ్చి ప్రేమలు

మన్నించవే ఓ ప్రేమా

- It's already the end -