00:00
03:34
మధురా నగరిలో
యమునా తటిలో
మురళీ స్వరములే
ముసిరిన యదలో
కురేసేనంట మురిపాల వాన
లయలై హోయలై జల జల జతులై
గల గల గతులై
వలపుల శృతులై
వయసుల ఆత్రుతలై
దొరక్క దొరక్క దొరికింది
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది
రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి
నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది
మధురా నగరిలో
మధురా నగరిలో యమునా తటిలో
మురళీ స్వరములే ముసిరిన యదలో
♪
చెంతకొచ్చెయ్యగానే
చెమక్కు చెమక్కు చురుక్కు చురుక్కు
చటుక్కు చటుక్కు చిటుక్కులే
చెయ్యి పట్టెయ్యగానే
తడక్కు తడక్కు దినక్కు దినక్కు
ఉడుక్కు ఉడుక్కు దుడుక్కులే
నువ్వులేక చందమామ చిన్నబోయే
నిన్ను చేరి వెన్నెలంత వెల్లువాయే
నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే
నిన్ను తాకి పూల గుట్టు తేలికాయే
ఈ మాటకే ఈరోజుకే ఇన్నాళ్ళు వేచానే
దొరక్క దొరక్క దొరికిందీ
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది
రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి
నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది
మధురా నగరిలో
మధురా నగరిలో యమునా తటిలో
మురళీ స్వరములే ముసిరిన యదలో