O Naadu Washington - S. P. Balasubrahmanyam

O Naadu Washington

S. P. Balasubrahmanyam

00:00

04:48

Similar recommendations

Lyric

ఓ నాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా

మబ్బుల్లో జాబిలి లాగా

నేనా పిల్లని చూశాగా

కళ్ళే చెదిరే ఆ అందం నా ముందే కనిపించంగా

నే సంబరపడిపోగా

తను తిక మక పడుతూ నాపై పడిపోయే

Hospitalలో చేర్చాక ఆ పిల్లే ఓ doctorగా

తొలి పరిచయం అయ్యాక

నే మాటలు కలిపేశాలే సరదాగా

వింతగా మొదలే అయిన స్నేహమే

అలా ప్రేమగా మారేనంట

ఎప్పటి నుంచో కన్న తియ్యని నా కల

అప్పుడు తీరేనంట

ఓ నాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా

మబ్బుల్లో జాబిలి లాగా

నేనా పిల్లని చూశాగా

ప్యారి ప్యారి ఈ love story

చివరికి ఎట్టా గెలిచ్చిందో చెప్తావా ఓ బావ

అదో భారీ so long story

ఓ... boxing మల్లన్న ఆ పిల్ల తండ్రి

తిప్పులు తిప్పాడే ఎన్నో తిప్పలు పెట్టాడే

హొ నా ఒళ్ళు గుల్లయినా చేశాను

వాడి పిల్ల కోసమే ఓ మల్ల యుద్ధమే

ప్రేమ కోసం మృత్యువుతో పోరాడి

నేనోడంగ మనసెంతో వేదనగా

తన కన్నులు జడివానలనే కురవంగా

బిడ్డ కోసం తన పంతం

ఆ తండ్రే విడిచేయంగా

నా చెలియే నవ్వంగా

తన ప్రేమను నే గెలిచాగా గర్వంగా

నీ కథ వింటూ ఉంటే

నిండు ప్రేమలో మాయగ ఉయ్యాలూగే

నీ ఎద తుళ్ళి ఆడే పెళ్లి పాటలో

ఈ కథ ఇలా సాగే

చాదస్తాల ఆ పిల్ల తల్లి

సాంప్రదాయాల్తో మతినే పోగొట్టే మా తల్లి

నన్నే పిలిచి అల్లం టీ ఇచ్చి

హేయ్ తిథి వార ఫలాల

మేలైన జోడి కుదిరినప్పుడే మేళ తాళలందిలే

హే దీటైన గుర్రాన్నే నేనెక్కి

స్వారీ చేసినప్పుడే పెళ్లి లగ్గాలందిలే

తాతల నాటి శీలూ డి వేలాడే కత్తే ఇచ్చి

నా చేతే పట్టించి

నా నడుముకి చమ్కి పట్టి కట్టింది

పోటా పోటి ఆ కుస్తీ రంగాన్నే వేదిక చేసి

విరి జల్లుల జడిలోని మహా సందడిగా

మా పెళ్లే జరిపింది

కాలం కలిసే ఉంటే

మీ కళ్యాణమే ఇక్కడ జరిగుండేది

(ఇక్కడ జరిగుండేది)

పెళ్లి వైభోగన్నే మేము చూసుంటే

ఎంతో బాగుండేది (ఎంతో బాగుండేది)

ఓ నాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా

మబ్బుల్లో జాబిలి లాగా

నేనా పిల్లని చూశాగా

- It's already the end -