Sande Poddula - S. P. Balasubrahmanyam

Sande Poddula

S. P. Balasubrahmanyam

00:00

04:25

Similar recommendations

Lyric

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది

అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది

మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు

ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో

ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

కొండాకోన జలకాలాడే వేళ

కొమ్మరెమ్మ చీర కట్టే వేళ

పిందె పండై చిలక కొట్టే వేళ

పిల్ల పాప నిదరే పోయే వేళ

కలలో కౌగిళ్ళే కన్నులు దాటాల

ఎదలే పొదిరిళ్లై వాకిలి తియ్యాల

ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది

అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది

ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

మల్లె జాజి మత్తు చల్లే వేళ

పిల్ల గాలి జోల పాడే వేళ

వానే వాగై వరదై పొంగే వేళ

నేనే నీవై వలపై సాగే వేళ

కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల

పుట్టిన ఎన్నెల్లో పుట్టకల్లు తాగాల

పగలే ఎన్నెల గుమ్మ చీకటి గువ్వాలాడాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు

ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో అరెరెరెరే

ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

- It's already the end -