Sri Hanuman Dandakam - Partha Saradhi

Sri Hanuman Dandakam

Partha Saradhi

00:00

03:53

Similar recommendations

Lyric

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం

భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం

భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం

బటంచున్ ప్రభాతంబు సాయంత్ర నీ నామసంకీర్తనల్ జేసి

నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబొక్కటిన్ జేయ

నూహించి నీ మూర్తినిన్గాంచి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై

రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్

నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే

నా మొరాలించితే నన్ను రక్షించితే

అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్

దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే

దగ్గరంబిల్చితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై

స్వామి కార్యంబునందుండి

శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి

సర్వేశు బూజించి

యద్భానుజున్ బంటు గావించి

యవ్వాలినిన్ జంపి

కాకుత్థ్స తిలకున్ దయాదృష్టి వీక్షించి

కిష్కింధ కేతెంచి

శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్

భూమిజన్ జూచి యానందముప్పొంగ

యాళుంగరంబిచ్చి యాతరత్నమున్ దెచ్చి

శ్రీరాముకున్నిచ్చి సంతోషునుంజేసి

సుగ్రీవునున్ అంగదున్ జాబవంతాది

నీలాదులున్గూడి ఆ సేతువున్ దాటి

వానరుల్ మూకలై దైత్యులంద్రుంచగా

రావణుండంత కాలాగ్నియుగ్రుండుడై

కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్

వేసి యా లక్ష్మణున్

మూర్ఛనొందింపగానప్పుడే పోయి సంజీవినిన్ తెచ్చి

సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాది వీరాదితో పోరాడి చెండాడి

శ్రీరామ బాణాన్ని వారందరిన్

రావణున్ జంపగానంత

లోకంబులానందమైయుండనవ్వేళనన్

నవ్విభీషణున్ వేడుకన్

దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి

సీతామహాదేవికిందెచ్చి శ్రీరాముకున్నిచ్చినయ్యోధ్యకుం వచ్చి

పట్టాభిషేకంబు సంరంభమైయున్న

నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు

మన్నించినన్ రామ భక్తి

ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే

పాపముల్ బాయునే

భయములున్ దీరునే భాగ్యముల్గల్గునే

సకల సామ్రాజ్యముల్

సకల సంపత్తులున్గల్గునే

వానరాకార యో భక్త మందార

యో పుణ్య సంచార

యో వీర యో శూర

నీవే సమస్తంబు నీవే ఫలంబు గా వెలసి యా

తారక బ్రహ్మమంత్రంబు పఠియించుచున్ స్థిరముగా

వజ్ర దేహంబునున్ దాల్చి శ్రీరామ

శ్రీరామయంచున్ మనః పూతమై

యెప్పుడున్ తప్పకన్

తలతునా జిహ్వయందుండి

నీ దీర్ఘదేహమ్ముత్రైలోక్య సంచారివై

రామనామాంకితధ్యానివై బ్రహ్మవై

తేజంబునన్ రౌద్రి నీజ్వాలకల్లోల

హావీర హనుమంత

ఓంకార హ్రీమ్ కార శబ్దంబులన్

భూత ప్రేత పిశాచంబులన్

గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి

నేలంబడం గొట్టి నీ ముష్టి ఘాతంబులన్

బాహుదండంబులన్ రోమఖండంబులన్

ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై

బ్రహ్మప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునున్ జూచి

రార నా ముద్దు నరసింహ యన్ చున్

దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామీ

నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే

వాయుపుత్రా నమస్తే

నమస్తే నమస్తే

నమస్తే నమస్తే నమస్తే నమః

- It's already the end -