O Vasumathi (From "Bharat Ane Nenu") - Yazin Nizar

O Vasumathi (From "Bharat Ane Nenu")

Yazin Nizar

00:00

04:33

Similar recommendations

Lyric

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా

ఓ వసుమతి ఒఓ వసుమతి

ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీ వల్ల

ఓ వసుమతి ఒఓ వసుమతి

ప్రపంచమేలు నాయక ఇదేగ నీకు తీరిక

మనస్సు దోచుకుంది నీ పోలికా

పదే పదే పనే అని మరి అలాగ ఉండక

పెదాల తీపి చూడగా రా ఇక

దరికి చేరవె సోకుల హార్మోనిక

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా

ఓ వసుమతి ఒఓ వసుమతి

ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీ వల్ల

ఓ వసుమతి ఒఓ వసుమతి

ఆ సూరీడుతోటి మంతనాలు చెయ్యనా

మాటలాడి చందమామ మనసు మార్చనా

నా రోజుకున్న గంటల్లన్ని పెంచనా నీ కోసం

ఓ విమానమంత పల్లకీని చూడనా

ఆ గ్రహాలు దాటి నీతొ journey చెయ్యనా

రోదసిని కాస్త romanticగ మార్చనా నీ కోసం

మెరుపు తీగల హారాలల్లి

సెకనుకొకటి కానుక చెయనా

వానవిల్లుని ఉంగరమల్లె

మలచి నీ కొనవేలికి తొడిగెయనా

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా

ఓ వసుమతి ఒఓ వసుమతి

ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీవల్ల

ఓ వసుమతి ఒఓ వసుమతి

ఒలె ఒలె ఒలె వసుమతి

వయ్యారి వసుమతి

అయ్యయ్యో అడిగెలోపె ఇచ్చినావే అనుమతి

నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి

పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి

ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకనా

అందులోన చిన్ని పూల మొక్క నాటనా

దానికేమొ నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో

నీ పెదాల ముద్ర బొమ్మలాగ చెయ్యనా

నా మెళ్ళోన దాన్ని locket అల్లె వెయ్యనా

మాటి మాటికది ముద్దుముచ్చటాడగా గుండెతో

ప్రతొక జన్మలో ముందే పుట్టి ప్రేమికుడిలా నీతో రానా

బ్రహ్మ గారికి request పెట్టి మరొక లోకం మనకై అడిగెయనా

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా

ఓ వసుమతి ఒఓ వసుమతి

ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీ వల్ల

ఓ వసుమతి ఒఓ వసుమతి

ఒలె ఒలె ఒలె వసుమతి

వయ్యారి వసుమతి

అయ్యయ్యో అడిగెలోపె ఇచ్చినావే అనుమతి

నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి

పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి

- It's already the end -