Kottaga - S. P. Balasubrahmanyam

Kottaga

S. P. Balasubrahmanyam

00:00

04:27

Similar recommendations

Lyric

కొత్తగా రెక్కలొచ్చెనా

గూటిలోని గువ్వపిల్లకి

మెత్తగా రేకు విచ్చెనా

మెత్తగా రేకు విచ్చెనా

కొమ్మ చాటునున్న కన్నెమల్లికి

కొమ్మ చాటునున్న కన్నెమల్లికి

కొత్తగా రెక్కలొచ్చెనా

మెత్తగా రేకు విచ్చెనా

కొండ దారి మార్చింది కొంటెవాగు జోరు

కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు

కొండ దారి మార్చింది కొంటెవాగు జోరు

కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు

బండరాళ్ల హోరు మారి పంటచేల పాటలూరి

బండరాళ్ల హోరు మారి పంటచేల పాటలూరి

మేఘాల రాగాల మాగాణి ఊగేలా సిరి చిందులేసింది కనువిందు చేసింది

కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి

ఎదురు లేక ఎదిగింది మధురగానకేళి

వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి

ఎదురు లేక ఎదిగింది మధురగానకేళి

భాషలోన రాయలేని రాసలీల రేయిలోని

అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలోని

యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి

మెత్తగా రేకు విచ్చెనా

మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నెమల్లికి

కొమ్మ చాటునున్న కన్నెమల్లికి

కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

- It's already the end -