00:00
04:01
ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన సమాచారం లేదు.
చాల్లే గానీ ఎంటా పరాకు
ఉన్నట్టుండి ఏమైంది నీకు
అయ్యో అని worry అయిపోకు
Tell me అని enquiryలు
అన్నీ ఎందుకు
మాతోనే నువ్వు ఉంటూ
మా ఊసే పట్టనట్టు
ఎదోలా ఎందుకుంటావ్
నీదీ లోకం కానట్టు
ఒదిగుంది లోని గుట్టు
కదిలిస్తే తేనె పట్టు
వదలదుగా వెంటపడుతూ
నాకేం తెలుసు ఇది ఇంతేనంటూ
మునిగే దాక లోతన్నది
కోలిచే వీలు ఏమున్నది
పరవాలేదు అంటూ మది
ప్రేమ లో పడ్డది
♪
ఆమె చెంపలా కంది పోవటం
ఏమి చెప్పటం ఎంత అద్భుతం
అందుకే కదా కోరి కోరి కయ్యాలు
అతని కోసమే ఎదురు చూడటం
బ్రతిమలాడి తను అలక తీర్చటం
పూటపూట ఎన్నెన్ని చిలిపి కలహాలు
జంటలెన్ని చెబుతున్నా
ఎన్ని కథలు వింటున్నా
అంతుపట్టదే ప్రేమా.ఏనాటికైనా
విన్నానని అంటావే కానీ
ఏమంటోంది ఆకాశవాణి
చూశాగాని వేరే లోకాన్నీ
ఏం చెప్పాలి చూపించే వీలు లేదని
♪
పక్కకెళ్లిపో పాడు మౌనమా
కరగవెందుకే కొంటె దూరమా
పక్కకెళ్లిపో పాడు మౌనమా
కరగవెందుకే కొంటె దూరమా
బయటపడని జత ఏదో చూసుకోరాదా
ఎంతసేపు ఈ వింత డైలమా
కథని కాస్త కదిలించు కాలమా
To be not to be debit ఎంతకీ తెగదా
కొత్త దారిలో నడక
ఇప్పుడిప్పుడే గనక
తప్పదేమో తడబడక అలవాటు లేక
♪
ఇన్నాళ్లుగా ఉన్నాగా నేను
నువ్వొచ్చాక ఏమై పోయాను
నీతో ఇలా అడుగేస్తున్నాను
ఏవైపంటే ఏమో ఎలాగ చెప్పను